Weather Forecast: గుడ్ న్యూస్, రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం,రుతుపవనాలు మళ్లీ వాయువ్య ప్రాంతాలను తేమగా మార్చే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

అంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rain Predictions | Image used for representational purpose | (Photo Credits: PTI)

రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభంకానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మరికొద్ది రోజుల్లో గాలిదిశ మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.దీంతో పాటు తిరోగమనానికి ముందు రుతుపవనాలు మళ్లీ వాయువ్య ప్రాంతాలను తేమగా మార్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif