West Bengal: మళ్లీ ఘోర రైలు ప్రమాదం తృటిలో మిస్, రైల్వే గేట్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌, రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటన మరువక ముందే జార్ఖండ్‌ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్‌ రైల్వే క్రాసింగ్‌ (Santhaldih railway crossing) సమీపంలోని రైల్వే గేటును ట్రాక్టర్‌ ఢీకొంది. అనంతరం గేటుకు, ట్రాక్‌కు మధ్యలో ఇరుక్కు పోయింది.

Representational (Credits: Facebook)

బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటన మరువక ముందే జార్ఖండ్‌ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్‌ రైల్వే క్రాసింగ్‌ (Santhaldih railway crossing) సమీపంలోని రైల్వే గేటును ట్రాక్టర్‌ ఢీకొంది. అనంతరం గేటుకు, ట్రాక్‌కు మధ్యలో ఇరుక్కు పోయింది.

అదే సమయంలో న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (New Delhi-Bhubaneswar Rajdhani Express) వచ్చింది. ట్రాక్‌ మధ్యలో ఇరుక్కున్న ట్రాక్టర్‌ను గమనించిన లోకో పైలెట్‌ వెంటనే అప్రమత్తమై రైలును ఆపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.ఘటన తర్వాత ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

IANS News

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement