West Bengal Extends COVID-19 Lockdown: జులై 1 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

వైర‌స్ వ్యాప్తిని అడ్డ‌కునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆమె తెలిపారు.

West Bengal CM Mamata Banerjee. (Photo Credit: Facebook/Mamata Banerjee)

ప‌శ్చిమ బెంగాల్ లో లాక్‌డౌన్ ను జులై 1 వ‌ర‌కూ పొడిగించిన‌ట్టు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ సోమ‌వారం ప్ర‌క‌టించారు. వైర‌స్ వ్యాప్తిని అడ్డ‌కునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆమె తెలిపారు. ఇక లాక్‌డౌన్ నియంత్ర‌ణ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కొంత మేర స‌డ‌లింపులు ఇచ్చింది. తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం బెంగాల్ లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను 25 శాతం సిబ్బందితో తెరిచేందుకు అనుమ‌తించారు. ప్రైవేట్ కార్యాల‌యాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కూ 25 శాతం సిబ్బందితో ప‌నిచేసే వెసులుబాటు క‌ల్పించారు.

షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ ల‌ను 50 శాతం సిబ్బందితో ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ ఓపెన్ చేసేందుకు అనుమ‌తించారు. ప్రేక్ష‌కులు లేకుండా క్రీడా కార్య‌క‌లాపాల‌కు వెసులుబాటు క‌ల్పించారు. విద్యాసంస్థ‌ల మూసివేత కొన‌సాగుతుండ‌గా అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్రైవేట్ వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)