IPL Auction 2025 Live

West Bengal Factory Blast: బాణాసంచా క‌ర్మాగారంలో భారీ పేలుడు, తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి, మృతులకు రూ. 2.5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం మమత

ఎగ్రాలో అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్న బాణాసంచా క‌ర్మాగారంలో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Representative Image

ప‌శ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినిపూర్ జిల్లాలో మంగ‌ళ‌వారం ఘోరం జ‌రిగింది. ఎగ్రాలో అక్ర‌మంగా నిర్వ‌హిస్తున్న బాణాసంచా క‌ర్మాగారంలో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ధాటికి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2.5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు.పశ్చిమ బెంగాల్ LoP సువేందు అధికారి నిన్న తొమ్మిది మంది మరణించిన తూర్పు మేదినీపూర్‌లోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్ బృందం విచారణ చేపట్టింది.

ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)