West Bengal Lockdown: రేపటి నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రేపటి (ఆదివారం) నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ కాలంలో అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోల్‌కతా మెట్రో సహా రవాణా వ్యవస్థను కూడా మూసివేసింది.

Containment zone in West Bengal | File Image | (Photo Credits: PTI)

అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఇచ్చింది. కిరాణా దుకాణాలతోపాటు అత్యవసర వినియోగ వస్తువులు విక్రయించే దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల వరకు తెరిచిపెట్టుకోవచ్చని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఆశ్చర్యకరంగా మిఠాయి దుకాణాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చింది. పెట్రోలు పంపులు, బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయి. అయితే, ఇవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే.

పరిశ్రమలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం తేయాకు తోటల్లో 50 శాతం సిబ్బందితో పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సాంస్కృతిక, రాజకీయ, విద్యాపరమైన, మతపరమైన కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడాన్ని నిషేధించింది. వివాహ కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదని బందోపాధ్యాయ్ తెలిపారు.

West Bengal announces restrictions

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now