Dr NK Arora: దేశంలో కోవిడ్ వ‌ల్ల 47 ల‌క్ష‌ల మంది మృతి చెందారనేది అబద్దం, డ‌బ్ల్యూహెచ్‌వో నివేదికన తప్పుబట్టిన కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్ట‌ర్ ఎన్‌కే అరోరా

దీన్ని కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్ట‌ర్ ఎన్‌కే అరోరా త‌ప్పుప‌ట్టారు. భార‌త్‌లో సంభ‌వించిన మ‌ర‌ణాల‌పై డ‌బ్ల్యూహెచ్‌వో ఇచ్చిన నివేదిక‌లో ఎటువంటి లాజిక్ కానీ వాస్త‌వం కానీ లేద‌న్నారు. ఆ నివేదిక ఆందోళ‌న కలిగించేలా ఉంద‌న్నారు.

NTAGI chief NK Arora (Photo-ANI)

భారతదేశంలో కోవిడ్ వ‌ల్ల 47 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించి ఉంటార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్‌లో తెలిపింది. దీన్ని కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్ట‌ర్ ఎన్‌కే అరోరా త‌ప్పుప‌ట్టారు. భార‌త్‌లో సంభ‌వించిన మ‌ర‌ణాల‌పై డ‌బ్ల్యూహెచ్‌వో ఇచ్చిన నివేదిక‌లో ఎటువంటి లాజిక్ కానీ వాస్త‌వం కానీ లేద‌న్నారు. ఆ నివేదిక ఆందోళ‌న కలిగించేలా ఉంద‌న్నారు. మ‌ర‌ణాల విష‌యంలో ఉంటే 20 శాతం తేడా ఉంటుందేమో అని ఆయ‌న అన్నారు.దేశంలో మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ విధానం ప‌టిష్టంగా ఉంద‌ని, వైర‌స్ సంబంధింత మ‌ర‌ణాల‌న్నీ న‌మోదు అయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. డ‌బ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ త‌ప్పుడుగా ఉంద‌ని అరోరా అన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు కొంత ఆల‌స్యంగా కోవిడ్ మ‌ర‌ణాల‌ను రిపోర్ట్ చేస్తున్నాయ‌ని, భార‌త్ చాలా పెద్ద దేశ‌మ‌ని, ఒక‌వేళ మ‌ర‌ణాల న‌మోదు త‌ప్పినా.. అది డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పిన‌ట్లు 10 శాతం తేడా ఉండ‌ద‌ని అరోరా అన్నారు. ఇండియా ఇచ్చిన డేటాను డ‌బ్ల్యూహెచ్‌వో ప‌ట్టించుకోలేద‌ని, త‌న సొంత గ‌ణాంకాల‌నే అది న‌మ్ముకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)