XXX Message on Railway LED display: రైల్వే స్టేషన్లో టీవీలో పోర్న్ సీన్లు ప్రత్యక్షం, సౌండ్ దెబ్బకు షాక్ తిన్న ప్రయాణికులు, బీహార్ భాగల్‌పూర్ రైల్వే స్టేషన్లో ఘటన

బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ పట్టణ రైల్వే స్టేషన్‌లోని టీవీ తెరపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నీలి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

A screengrab of the video shows vulgar message flashing on the LED display. (Photo credits: Twitter/@Mohit_ksr)

బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ పట్టణ రైల్వే స్టేషన్‌లోని టీవీ తెరపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నీలి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 5 నుంచి 10 నిమిషాలు ప్రసారమైన ఆ సమాచారాన్ని కొంతమంది తమ సెల్‍‌ఫోన్లలో చిత్రీకరించగా, మరికొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది టీవీ ప్రసారాలను నిలిపివేశారు.

ఈ విషయంపై సబ్ డివిజనల్ అధికారి ధనంజయ కుమార్, డీఎస్పీ అజయ్ కుమార్ చౌదరిలు స్పందించి, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత మార్చి నెలలో కూడా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలోని రైల్వే స్టేషన్‌లో ఏకంగా మూడు నిమిషాల పాటు నీలి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement