YS Family's Property Dispute: ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటి ? జగన్ మీద యనమల సంచలన వ్యాఖ్యలు
తల్లి, చెల్లిపై కేసులేయడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాతాళంలోకి పడిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు.
తల్లి, చెల్లిపై కేసులేయడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాతాళంలోకి పడిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు. చివరికి జగన్ తన సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇది ఆస్తుల వివాదం కాదని, రాజకీయ ఆత్మహత్యేనని యనమల పేర్కొన్నారు. షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చానని జగన్ చెప్పినా... ఐటీ, ఈడీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు ఆయనకు ఈ రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ సందర్భంగా జగన్‌పై యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అనేది పగటి కలేనని చురకలంటించారు. పాత కేసులకు తోడు కొత్త కేసులు ఆయనపై సిద్ధంగా ఉన్నాయని, ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)