Zika Virus in Mumbai: దేశంలో మరోసారి జికా వైరస్‌ కలకలం, ముంబైలో 79 ఏళ్ల వ్యక్తిలో వైరస్ లక్షణాలు, పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..

దేశంలో జికా వైరస్‌ మరోసారి కలకలం రేపుతోంది. మహారాష్ట్ర రాజధాని ముంబయి చెంబూర్‌ సమీపంలోని ఎం-వెస్ట్‌ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్‌ సోకినట్లు తేలింది. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని, బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అధికారులు పేర్కొన్నారు.

Virus (Photo Credits : Pixabay)

దేశంలో జికా వైరస్‌ మరోసారి కలకలం రేపుతోంది. మహారాష్ట్ర రాజధాని ముంబయి చెంబూర్‌ సమీపంలోని ఎం-వెస్ట్‌ వార్డులో నివాసం ఉంటున్న 79 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్‌ సోకినట్లు తేలింది. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని, బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తి జులై 19 నుంచి జ్వరం, ముక్కు మూసుకుపోవడం, దగ్గుతో సహా పలు లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జికా వైరస్‌కు నిర్ధిష్టంగా ఏ చికిత్స లేదు. నొప్పి నుంచి ఉపశమనం కోసం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. జికా వైరస్‌ సాధారణంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏడిస్‌ దోమల కారణంగా సోకుతుంది. మనిషిని కుడితే.. జికా సోకే ప్రమాదం ఉంటుంది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement