Zydus Cadila: దేశీయ వ్యాక్సిన్ జైకోవ్‌-డి సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి, అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన భారత ఔషధ నియంత్రణమండలి

ఈ టీకాకు శుక్రవారం భారత ఔషధ నియంత్రణమండలి (డీజీసీఏ) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

దేశీయంగా అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డి’ వ్యాక్సిన్‌ సెప్టెంబరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టీకాకు శుక్రవారం భారత ఔషధ నియంత్రణమండలి (డీజీసీఏ) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ధర, సరఫరా విషయంలో నియంత్రణాధికారులతో కలిసి పనిచేస్తున్నాం. వచ్చే రెండు వారాల్లో ధరపై స్పష్టత వస్తుంది’’ అని జైడస్‌ గ్రూప్‌ ఎండీ షార్విల్‌ పటేల్‌ తెలిపారు. సెప్టెంబరు చివరికల్లా టీకాల సరఫరా ఆరంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబరుకల్లా కోటి డోసుల సామర్థ్యానికి చేరుకుంటామని, జనవరి ఆఖరికల్లా దీన్ని ఐదు కోట్లకు పెంచుతామని చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు