Owaisi on Opposition Meeting: మోదీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాల సమావేశం,మీ ట్రాక్ రికార్డ్ ఏమిటంటూ విరుచుకుపడిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విపక్షాల సమావేశంపై విరుచుకుపడ్డారు, “అక్కడ సమావేశమైన ఈ రాజకీయ నేతలందరి ట్రాక్ రికార్డ్ ఏమిటని ప్రశ్నించారు.

Lok Sabha MP Asaduddin Owaisi (Photo: File)

ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విపక్షాల సమావేశంపై విరుచుకుపడ్డారు, “అక్కడ సమావేశమైన ఈ రాజకీయ నేతలందరి ట్రాక్ రికార్డ్ ఏమిటని ప్రశ్నించారు.ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ని ఎదుర్కోవడానికి ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతల సమావేశం పాట్నాలో ఈరోజు ప్రారంభమైంది. 15కి పైగా ప్రతిపక్షాలు పాట్నాలోని నితీశ్‌కుమార్‌ అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయ్యాయి .

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, ఎంపీ సంజయ్ రౌత్ , ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశానికి హాజరయ్యారు.

ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement