Amit Malviya Booked: రాహుల్ గాంధీ చాలా ప్రమాదకారి అంటూ ట్వీట్, బీజేపీ ఐటీ సెల్ చీఫ్‌ అమిత్ మాలవీయపై కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై.. భారతీయ జనతా పార్టీ (BJP) ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ చేసిన ట్వీట్ ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టింది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై మాలవీయ ఇచ్చిన ట్వీట్‌లో, రాహుల్ చాలా ప్రమాదకారి అని, ఆయన వంచన, మోసపూరిత ఆట ఆడుతున్నారని ఆ యానిమేటెడ్ వీడియో ద్వారా ఆరోపించారు.

Rahul Gandhi Animated Video. (Photo Credits: Twitter Video Grab)

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై.. భారతీయ జనతా పార్టీ (BJP) ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ చేసిన ట్వీట్ ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టింది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై మాలవీయ ఇచ్చిన ట్వీట్‌లో, రాహుల్ చాలా ప్రమాదకారి అని, ఆయన వంచన, మోసపూరిత ఆట ఆడుతున్నారని ఆ యానిమేటెడ్ వీడియో ద్వారా ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు ఫిర్యాదు ఆధారంగా బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం మాలవీయపై కేసు నమోదైంది. భారత శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్లు 153ఏ, 120బీ, 505(2), 34ల ప్రకారం పోలీసులు ప్రాథమిక సమాచార నివేదిక (FIR)ను నమోదు చేశారు.

Here's  Amit Malviya Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now