IPL Auction 2025 Live

Champai Soren Resigns as Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా, మళ్ళీ సీఎంగా హేమంత్‌ సోరెన్‌

బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు చేరుకున్న చంపై గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ రంగం సిద్ధం చేసుకున్నారు

Champai Soren Resigns as Chief Minister of Jharkhand, Hemant Soren Likely to Return as CM

జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు చేరుకున్న చంపై గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ రంగం సిద్ధం చేసుకున్నారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ మూడోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

రాంచీలోని ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ నివాసంలో జరిగిన సమావేశంలో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా హేమంత్ సోరెన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 'ఛంపాయ్‌ సోరెన్‌ స్థానంలో హేమంత్‌ సోరెన్‌ని నియమించాలని సమావేశంలో నిర్ణయించారు' అని పార్టీ వర్గాలు వార్తా సంస్థ పిటిఐకి తెలిపాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)