Congress President Election: అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు, షెడ్యూల్ విడుదల చేసిన సీడబ్ల్యూసీ
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల అక్టోబర్ 17న నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ తర్వాత రెండు రోజుల్లో విజేత పేరును ప్రకటించనున్నట్లు తెలిపాయి.పార్టీ నూతన సారథి ఎన్నిక కోసం సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు.
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల అక్టోబర్ 17న నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ తర్వాత రెండు రోజుల్లో విజేత పేరును ప్రకటించనున్నట్లు తెలిపాయి.పార్టీ నూతన సారథి ఎన్నిక కోసం సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు.సెప్టెంబర్ 24 నుంచి 30 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు విజేత పేరును ప్రకటిస్తారు. ఎన్నిక షెడ్యూల్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం చివరిసారిగా 2000 నవంబర్‌లో ఎన్నిక నిర్వహించారు. సోనియా గాంధీ మధ్యలో రెండేళ్లు(2017–2019) మినహా 1998 నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.