Dhananjay Munde Resigns: మహారాష్ట్రలో సర్పంచ్‌ దారుణ హత్య, మంత్రి పదవికి ధనంజయ్‌ ముండే రాజీనామా, రాజకీయ ప్రకంపనలు రేపుతున్న సర్పంచ్‌ సంతోష్‌ దేశ్‌ముఖ్‌ హత్య కేసు

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో సర్పంచ్‌ సంతోష్‌ దేశ్‌ముఖ్‌ హత్య కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే (Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Maharashtra Minister Dhananjay Munde (Photo Credits: Facebook)

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో సర్పంచ్‌ సంతోష్‌ దేశ్‌ముఖ్‌ హత్య కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే (Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్‌ ముండేను సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఫడణవీస్‌ మాట్లాడుతూ ముండే రాజీనామాను తాను ఆమోదించి.. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపానని మీడియాకు తెలిపారు.

వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్‌ చేసిన పోలీస్‌ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్‌

ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గంలో కీలకనేత అయిన ధనంజయ్‌ ముండే సొంత జిల్లా బీడ్‌లో మసాజోగ్‌ గ్రామ సర్పంచి సంతోష్‌ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్‌ చేసి ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి చంపారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ హత్యోదంతానికి సంబంధించిన కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్‌ కరాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

CM Devendra Fadanvis Announces Resignation of Maharashtra Minister

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement