Hemant Soren Granted Bail: భూ కుంభకోణం కేసు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు
భూ కుంభకోణం కేసు ( land scam case)లో అరెస్టైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (former Jharkhand Chief Minister) హేమంత్ సోరెన్ (Hemant Soren)కు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) తాజాగా బెయిల్ మంజూరు చేసింది.
భూ కుంభకోణం కేసు ( land scam case)లో అరెస్టైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (former Jharkhand Chief Minister) హేమంత్ సోరెన్ (Hemant Soren)కు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.
జార్ఖండ్ ముఖ్యంమత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరేన్ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీలాండరింగ్ నియంత్రణ చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న ఆయన దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్‌పై బయటకు రాబోతున్నారు. అరెస్ట్ అనంతరం సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)