HC on Elderly Couple's Alimony: భరణం కోసం భార్యాభర్తలు గొడవ, ఈ వయసులో మీ గొడవతో కలియుగం వచ్చినట్లుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు జడ్జి

జీవన భృతి కోసం కొట్టుకున్న భార్యాభర్తల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీ గొడవతో కలియుగం వచ్చేసినట్టుంది’ అంటూ దుపరి విచారణలోగా మీలో మీరు మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకోండని సూచించారు. కేసు విచారణను వాయిదా వేశారు.

Allahabad High Court

జీవన భృతి కోసం కొట్టుకున్న భార్యాభర్తల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీ గొడవతో కలియుగం వచ్చేసినట్టుంది’ అంటూ దుపరి విచారణలోగా మీలో మీరు మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకోండని సూచించారు. కేసు విచారణను వాయిదా వేశారు. కేసులోకి వెళితే..అలీగఢ్ కు చెందిన మునేశ్ కుమార్ గుప్త (80) తన భార్య నుంచి విడాకులు పొందారు.

తక్కువ కట్నం ఇచ్చినందుకు భార్యను అవమానించడం శిక్షార్హమైన నేరం కాదు, వరకట్నంపై అలహబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మనోవర్తి కావాలంటూ గుప్త భార్య కోరగా.. ఫ్యామిలీ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పును గుప్త అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం ఈ కేసు విచారణకు హాజరైన గుప్త, ఆయన భార్యను చూసి జస్టిస్ సౌరభ్ శ్యామ్ శంషేరి ఆశ్చర్యపోయారు. ఈ వయసులో ఇదేం గొడవ అని మందలిస్తూ.. ఇద్దరూ కూర్చుని సామరస్యపూర్వకంగా ఒప్పందానికి రావాలని సూచిస్తూ విచారణను వాయిదా వేశారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement