Karnataka Assembly Elections 2023: రైతు కొడుకును పెళ్లి చేసుకునే యువతికి రూ.2 లక్షలు, కర్ణాటక ఎన్నికల్లో హామీల జల్లు కురిపించిన కుమారస్వామి
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka polls) ప్రచారంలో నేతలు హామీలు గుప్పిస్తున్నారు. రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ రూ. 2 లక్షలు అందచేస్తుందని జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తాజాగా స్పష్టం చేశారు.
Rs 2 lakh for women marrying farmers' sons: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka polls) ప్రచారంలో నేతలు హామీలు గుప్పిస్తున్నారు. రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ రూ. 2 లక్షలు అందచేస్తుందని జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తాజాగా స్పష్టం చేశారు.కోలార్‌లోని పంచరత్నలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కుమారస్వామి మాట్లాడుతూ రైతుల పిల్లల పెండ్లిండ్లను ప్రోత్సహించేందుకు వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువతులకు ప్రభుత్వం రూ. 2 లక్షల నగదు అందించాలని కోరారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. కర్నాటకలో 224 స్ధానాలకు గాను జేడీ(ఎస్) 123 స్ధానాల్లో పోటీ చేస్తుండగా ఇప్పటివరకూ 93 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)