Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, 14 మందితో ఎనిమిదో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, లిస్టు ఇదిగో..

లోక్‌సభ ఎన్నికలకు 14 మంది అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ బుధవారం విడుదల చేసింది, మధ్యప్రదేశ్‌లోని గుణాలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై రావు యద్వేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది.

Jyotiraditya Scindia and Rao Yadvendra Singh (Photo Credit: ANI)

లోక్‌సభ ఎన్నికలకు 14 మంది అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ బుధవారం విడుదల చేసింది, మధ్యప్రదేశ్‌లోని గుణాలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై రావు యద్వేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది.విదిశాలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ప్రతాప్ భాను శర్మను కూడా పోటీకి దింపింది. తర్వర్ సింగ్ లోధి దామోహ్ నుండి నామినేట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌, తెలంగాణలో నాలుగు స్థానాలకు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో ముగ్గురికి కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 208కి చేరింది.  బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్న 17 మంది ఎంపీ అభ్యర్థులు వీళ్లే, హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ

తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. మెదక్‌ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, నిజామాబాద్‌ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక నాలుగు స్థానాలు ఖమ్మం, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ అభ్యర్థులు ఎవరనేది ఇంకా స్పష్టతలోకి రాలేదు. ఈ నెల 31న మరోసారి జరగనున్న సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Here's List

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now