Lok Sabha Elections: ఖమ్మం లేదా భువనగిరి నుండి లోక్‌సభ బరిలోకి దిగనున్న రాహుల్ గాంధీ.. పత్రికల్లో కథనాలు
ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని, దీనికి రాహుల్ గాంధీ కూడా అంగీకరించినట్లు పలు పత్రికల్లో, సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
Hyderabad, Feb 27: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తెలంగాణలోని (Telangana) ఖమ్మం (Khammam) లేదా భువనగిరి స్థానం నుంచి పోటీ చేయొచ్చు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని, దీనికి రాహుల్ గాంధీ కూడా అంగీకరించినట్లు పలు పత్రికల్లో, సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. అయితే, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా.. గత ఎన్నికల్లో అమేథీతో పాటు వయనాడ్ నుంచి పోటీచేసిన రాహుల్ అమేథీలో ఓడిపోగా, వయనాడ్ స్థానంలో గెలిచి ఎంపీ అయ్యారు. దీంతో దక్షిణ రాష్ట్రాల నుండే పోటీలో ఉండాలని రాహుల్ అనుకుంటున్నట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)