cm revanth reddy

Hyderabad, Feb 27: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) భాగంగా మరో రెండింటిని అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. నేడు సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకు గ్యాస్ సిలిండర్ హమీలను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు.  ఇక లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

AP Assembly Speaker: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వేటు వేసిన ఏపీ అసెంబ్లీ స్పీకర్‌..టీడీపీ నలుగురు..వైఎస్సార్సీపికి చెందిన నలుగురి పై అనర్హత వేటు

ప్రియాంక  వస్తారా? లేదా?

నేడు జరుగనున్న రెండు గ్యారెంటీల షురూ కార్యక్రమానికి తొలుత కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ రాలేకపోతున్నట్టు సమాచారం. కుదిరితే వర్చువల్ విధానంలో ఆమె హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Vijay Shekhar Sharma Resigns: పేటీఎం బ్యాంకుకు బిగ్ షాక్, చైర్మన్ పదవికి రాజీనామా చేసిన విజయ్ శేఖర్ శర్మ, కొత్త ఛైర్మన్‌ని నియమించే ప్రక్రియ ప్రారంభించిన One 97 కమ్యూనికేషన్