Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర మంత్రులుగా 18 మంది ప్రమాణ స్వీకారం, శివసేన నుంచి 9 మంది, బీజేపీ నుంచి 9 మంది ప్రమాణం

Deputy CM Devendra Fadnavis and Maharashtra CM Eknath Shinde. (Photo Credits: ANI)

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 18 మంది రాజభవన్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు మంత్రులతో గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారి ప్రమాణస్వీకారం చేయించారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇంకా శాఖలను కేటాయించలేదు. మంత్రులు అయిన వారిలో బీజేపీ నుంచి తొమ్మది మంది, శివసేన నుంచి తొమ్మిది మంది ఉన్నారు.

ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వర్గం: చంద్రకాంత్‌ పాటిల్,సుధీర్‌ మునగంటివార్, గిరీష్‌ మహాజన్, సురేశ్‌ ఖడే,  రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్‌ ప్రభాత్‌ లోధా, విజయ్‌ కుమార్‌ గవిత్‌, అతుల్‌ సేవ్‌ ఉన్నారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వర్గం: దాదా భుసే, శంభురాజ్‌ దేశాయ్, సందీపాన్‌ భుమరే, ఉదయ్‌ సామంత్‌, తానాజీ సావంత్‌, అబ్దుల్‌ సత్తార్, దీపక్‌ కేసర్కర్, గులాబ్‌రావ్‌ పాటిల్, సంజయ్‌ రాథోడ్‌ ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement