Maharashtra Political Crisis: రేపటితో మహా డ్రామాకు తెర, బల నిరూపణకు ఆదేశించిన గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారి, ఇప్పటివరకు పార్టీల బలబలాలు ఇవే..

శివ సేన నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం.. మహా వికాస్‌ అఘాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారిని కలిసి ఫ్లోర్‌ టెస్ట్‌ నిర్వహించాలని కోరింది

Bhagat-Singh-Koshyari

మహారాష్ట్ర రాజకీయాలు ఫైనల్ స్టేజికి చేరుకున్నాయి. శివ సేన నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం.. మహా వికాస్‌ అఘాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారిని కలిసి ఫ్లోర్‌ టెస్ట్‌ నిర్వహించాలని కోరింది. ఈ తరుణంలో మహారాష్ట్ర గవర్నర్‌ బలనిరూపణకు సీఎం ఉద్దవ్‌థాక్రే ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించారు.

గురువారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. అదే రోజు సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. సాయంత్రం ఐదు గంటల వరకే డెడ్‌లైన్‌ విధిస్తూ.. ఆ బలపరీక్షను రికార్డ్‌ చేయాలని ఆదేశించారాయన. ఇదిలా ఉండగా బలనిరూపణ నేపథ్యంలో.. రేపు సాయంత్రం షిండే వర్గం గువాహతి నుంచి ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బలనిరూపణ తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని షిండే ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు)

మెజారిటీ మార్కు: 144

మహా వికాస్‌ అఘాడి కూటమి వాస్తవ బలం: 168

రెబల్ ఎమ్మెల్యే షిండే తిరుగుబాటు తర్వాత: 119

షిండే కూటమిలోని మొత్తం ఎమ్మెల్యేలు: 49 మంది

బీజేపీ కూటమి వాస్తవ బలం: 113

అసెంబ్లీలో షిండే కూటమి మద్దతిస్తే: 162

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)