Rahul Gandhi Speech in Lok Sabha: మీరే దేశద్రోహాలు, మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు, అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లానని, కానీ మన ప్రధాని ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లలేదన్నారు. మణిపూర్ మన దేశంలో లేదని ఆయన భావిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ అన్న పదాన్ని తాను వాడానని, కానీ వాస్తవం ఏంటంటే ఆ రాష్ట్రం ఇక లేదన్నారు.
అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లానని, కానీ మన ప్రధాని ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లలేదన్నారు. మణిపూర్ మన దేశంలో లేదని ఆయన భావిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ అన్న పదాన్ని తాను వాడానని, కానీ వాస్తవం ఏంటంటే ఆ రాష్ట్రం ఇక లేదన్నారు. మణిపూర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించినట్లు రాహుల్ పేర్కొన్నారు. మణిపూర్‌ను విభజించి, విడగొట్టినట్లు రాహుల్ అన్నారు. మణిపూర్‌ను చంపి భారత్‌ను హత్య చేశారని ఆరోపించారు. మీరే దేశద్రోహాలు అని రాహుల్ విమర్శించారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారన్నారు. రాహుల్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
Here's ANI Videos