Navjot Singh Sidhu Resigns: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా, పార్టీ అధ్యక్షురాలు సోనియా ఆశించినట్లే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు తప్పుకోవాలని సోనియా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు తప్పుకోవాలని సోనియా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే సిద్దూ తన రాజీనామా లేఖను సమర్పించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా ఆశించినట్లే తాను రాజీనామా చేస్తున్నట్లు సిద్దూ తన ట్విట్టర్‌లో తెలిపారు.
ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ చీఫ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా.. పీసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. మరోవైపు.. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు గణేశ్ గోడియాల్ ప్రకటించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)