Rahul Gandhi Vacate Wayanad: రాయ్‌బరేలికి జై.. వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ, ఆ సీటు నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి

కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌గాంధీ కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకోనున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ రాజీనామా చేస్తున్న వాయనాడ్‌ నుంచి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ బరిలో దిగనున్నారు. ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.

Rahul Gandhi

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నివాసంలో మీడియాతో మాట్లాడుతూ..తాను వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి, రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్‌గాంధీ చెప్పారు. వాయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నప్పటికీ అక్కడి ప్రజలతో తన అనుబంధం కొనసాగుతుందని చెప్పారు. రాయ్‌బరేలీ, వాయనాడ్‌లలో ఏ స్థానాన్ని వదులుకోవాలనే విషయాన్ని తేల్చుకోవడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now