Rahul Gandhi Attack on PM Modi: జై శ్రీరాం అంటూ ఆకలితో చావండి, ప్రధాని మోదీకి కావాల్సింది ఇదే, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఫోన్ చూడాలి.. జై శ్రీరాం అనాలి. అలా చేస్తూ ఆకలితో చావండి. ప్రధాని మోదీకి కావాల్సింది ఇదే అని’ రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi (Photo Credits: @bharatjodo)

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఫోన్ చూడాలి.. జై శ్రీరాం అనాలి. అలా చేస్తూ ఆకలితో చావండి. ప్రధాని మోదీకి కావాల్సింది ఇదే అని’ రాహుల్ గాంధీ అన్నారు.మధ్యప్రదేశ్ సారంగపూర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు. ఓ వైపు దేశంలో నిరుద్యోగం, ఉపాధి లేక ఆకలి చావులు పెరిగిపోతున్నాయని.. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం ‘జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో 'జై శ్రీరాం' అని చెప్పిపిస్తూ.. వారు ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆరోపించారు.

ఈ యాత్రలో భాగంగా రాహుల్‌కు ‘ మోదీ, మోదీ, జై శ్రీరాం’ అనే నినాదాలతో బీజేపీ కార్యకర్తలు వ్యంగ్యంగా ఆహ్వానం పలికారు. బీజేపీ శ్రేణుల చర్యపై స్పందించిన రాహుల్‌.. మోదీపై పై విధంగా విమర్శలు గుప్పించారు. భారత్‌లో నిరుద్యోగం 23 శాతంగా ఉంటే పాక్‌లో 12 శాతం ఉందన్నారు. బంగ్లాదేశ్, భూటాన్‌ల కంటే దేశంలో నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉందని, భారతదేశ నిరుద్యోగిత రేటు గత 40 ఏళ్లలో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement