Jaiveer Shergill Quits: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత జైవీర్ షెర్గిల్,అన్ని పార్టీ పదవులకు ఆయన రాజీనామా, పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని వెల్లడి

కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత, జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ గుడ్‌బై చెప్పారు. అన్ని పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని, ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ పాటుపడే పరిస్థితి కనిపించలేదని రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు.

Jaiveer Shergill. (Photo Credits: Twitter)

కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత, జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ గుడ్‌బై చెప్పారు. అన్ని పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం మొత్తం భజనపరుల కోటరీగా మారిందని, ప్రజా ప్రయోజనాల కోసం పార్టీ పాటుపడే పరిస్థితి కనిపించలేదని రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేశానని, తాను పార్టీ నుంచి తీసుకున్నదేమీలేదని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ మీడియాలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అధికార ప్రతినిధిగా పార్టీ అభిప్రాయాలను బలంగా వినిపించే నేతగా పేరున్న జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ మంచిపేరు తెచ్చుకున్న షెర్గిల్‌ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. జైవీర్ షెర్గిల్ ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టం కాలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

BRS MLAs Defection Case: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

Share Now