Tamil Nadu Polls: బట్టలు ఉతికి..గిన్నెలు తోమిన ఏఐఏడిఎంకె ఎమ్మెల్యే అభ్యర్థి కతిరావన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన కతిరావన్
పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నాగపట్నం అసెంబ్లీ (Nagapattinam assembly) నియోజకవర్గం ఏఐఏడిఎంకె అభ్యర్థి తంగా కతిరావన్ బహిరంగంగా బట్టలు ఉతికి సంచలనం (AIADMK candidate impresses voters) సృష్టించారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే తన నియోజక వర్గంలో ‘అమ్మప్రభుత్వం’ ప్రతీ ఇంటికి ఒక వాషింగ్ మెషీన్‌ను ఇస‍్తుందని హామీ ఇచ్చారు. చురుకైన స్థానిక నేతగా పేరొందిన కతివారన్ తొలిసారి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. నాగపట్టణంలో ప్రచారానికి వెళ్లిన సమయంలో ఒక మహిళ బట్టలు ఉతుకుతూ(washing cloths to indicate manifesto assurance) కనిపించింది. అంతే రంగంలోకి దిగిన కతిరావన్ బట్టలు తాను ఉతుకుతానని ఆమెను కోరారు.మొదటలో మొహమాటంతో కాస్త సంశయించిన ఆ మహిళ చివరికి ఆయన చేతికి దుస్తులు ఇవ్వక తప్పలేదు.
కాసేపు బట్టలు వాష్ చేసిన ఆయన, పనిలో పనిగా పక్కనే ఉన్న గిన్నెలను కూడా తోమేశారు. ఈ పరిణామంతో ఔరా అంటూ ఆశ్చర్యపోవడం అక‍్కడున్నవారి వంతైంది. కాగా ఇంటింటికి వాషింగ్ మెషీన్లు, సోలార్ స్టవ్‌లు, కేబుల్ టీవీ కనెక్షన్లను ఫ్రీగా ఇస్తామని అన్నా డీఎంకే తాజా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Here's washed clothes Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)