Thawarchand Gehlot: కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా తవార్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం, గెహ్లాట్‌చేత ప్రమాణం చేయించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ ఎస్ ఓకా
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ ఎస్ ఓకా గెహ్లాట్‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గెహ్లాట్ కన్నా ముందు వాజుభాయ్‌వాలా ఆరేళ్ళ 10 నెలల పాటు కర్ణాటక గవర్నర్ గా కొనసాగారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయానికి గెహ్లాట్ చేరుకున్నారు.
కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా తవార్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ ఎస్ ఓకా గెహ్లాట్‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గెహ్లాట్ కన్నా ముందు వాజుభాయ్‌వాలా ఆరేళ్ళ 10 నెలల పాటు కర్ణాటక గవర్నర్ గా కొనసాగారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయానికి గెహ్లాట్ చేరుకున్నారు.
రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక్ పుష్పగుచ్చాలు అందించి మైసూరు పాగాతో సత్కరించి స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రవికుమార్, డీజీపీ ప్రవీణ్‌సూద్ నూతన గవర్నర్‌ను స్వాగతించారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వచ్చారు. రాజ్‌భవన్ పాలనాధికారి సహా సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ ఎస్ ఓకా గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్‌చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
Here's ANI Update:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)