Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తప్పిన ప్రమాదం.. స్టేజ్ ఎక్కుతూ కిందపడిన వైనం.. భద్రతా సిబ్బంది సహకారంతో పైకి లేచిన గవర్నర్ (వీడియోతో)
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Hyderabad, Dec 23: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Telangana Governor Tamilisai Soundararajan) కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో (JNTU) జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదిక పైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే రెండు చేతులు కిందకు పెట్టడంతో ఆమెకు పెద్దగా దెబ్బలు తగలలేదు. వెంటనే గవర్నర్ వెనుక ఉన్న భద్రతా సిబ్బంది స్పందించి, గవర్నర్ ను పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)