
Vjy, Jan 22: కర్ణాటకలో మంత్రాలయ విద్యార్థుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విద్యార్థులు, డ్రైవర్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన.. కర్ణాటక(Karnataka)లో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో మంత్రాలయం వేద పాఠశాలకు(Manthralaya Veda Patashala) చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి(Students Died) చెందిన వార్త దిగ్భ్రాంతి(Shock)ని, తీవ్ర ఆవేదనను కలిగించిందని తెలిపారు.
హంపీకి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను అదేశించినట్లు సీఎం చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి(Deep Condolences) తెలియజేశారు. ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాయచూరు సింధనూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, డ్రైవర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం తెలిపారు. బుధవారం కర్ణాటకలోని జిల్లాలో వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
కాగా, మంత్రాలయం, వేదపాఠశాల విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు మరియు అధికారుల నుండి సమగ్ర సమాచారం కోరారు.
ఇది కాకుండా, కర్ణాటకలోని ఉత్తర కన్నడలోని అరేబైల్ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య 11కి చేరుకుంది. బాధితులు కూరగాయలు విక్రయిస్తుండగా సావనూరు నుంచి కుంట మార్కెట్‌కు కూరగాయలు విక్రయించేందుకు వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి 50 మీటర్ల లోతు లోయలో పడిపోయింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదాలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు మరియు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందజేస్తుందని చెప్పారు.మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద ఘటనల్లో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందజేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.