Uttar Pradesh Exit Poll Results 2022: ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ జెండా, అత్యధిక స్థానాలతో అధికారంలోకి వస్తుందని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది.
బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది.
సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితం కానుంది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం యూపీలో బీజేపీకి 262 నుంచి 277 స్థానాలు దక్కుతాయి. న్యూస్ 18 ప్రకారం బీజేపీకి 263 స్థానాలు దక్కుతాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)