Uttarakhand Exit Poll Results 2022: ఉత్తరాఖండ్‌లో హోరా హోరీ, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్, బీజేపీ గట్టి పోటినిచ్చే అవకాశం

జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పాగా వేసే వీలుంది. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 35 నుంచి 40 సీట్లు గెలుచుకుని మొదటి వరుసలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ 26 నుంచి 30 సీట్లు, బీఎస్‌పీ 2 నుంచి 3, ఇతరుల ఒకటి నుంచి మూడు సీట్లు గెలుచుకోవచ్చు.

PM Modi vs Rahul Gandhi (Photo Credits: PTI)

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పాగా వేసే వీలుంది. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 35 నుంచి 40 సీట్లు గెలుచుకుని మొదటి వరుసలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ 26 నుంచి 30 సీట్లు, బీఎస్‌పీ 2 నుంచి 3, ఇతరుల ఒకటి నుంచి మూడు సీట్లు గెలుచుకోవచ్చు.

ఇండియా టుడే సర్వేలో కాంగ్రెస్ 20 నుంచి 30 సీట్లు, బీజేపీ 36 నుంచి 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఏబీసీ ఓటరు సర్వేలో కాంగ్రెస్ 32 నుంచి 38, బీజేపీ 26 నుంచి 32 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. జన్ కి బాత్ ఇండియా న్యూస్ ప్రకారం.. కాంగ్రెస్ 27 నుంచి 35 సీట్లు, బీజేపీ 32 నుంచి 41 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. న్యూస్ 24 ప్రకారం కాంగ్రెస్ 43 సీట్లు, బీజేపీ 36 నుంచి 24 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్‌ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. కాగా, తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్‌ కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now