YouTuber Manish Kashyap Joins BJP: కాషాయపు కండువా కప్పుకున్న ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్, వీడియో ఇదిగో..
ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీకి తన తల్లి పెద్ద అభిమాని అని చెప్పారు
బీహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ కాషాయపు కండువా కప్పుకున్నారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీకి తన తల్లి పెద్ద అభిమాని అని చెప్పారు. ఆ క్రమంలో ఆమె సలహా మేరకు తాను బీజేపీలో చేరినట్లు మనీష్ కశ్యప్ వివరించారు. బిహార్‌లో బీజేపీ బలపడేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బిహార్ రాష్ట్రాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం దోచేసిందని ఆరోపించారు. ఆ కుటుంబం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్, ఎస్పీ చేసేవన్నీ విభజన రాజకీయాలే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని మండిపడిన ప్రధాని మోదీ
బిహార్‌కు చెందిన మనీష్ కశ్యప్.. ప్రముఖ యూట్యూబర్. మనీష్ కశ్యప్ సన్ ఆఫ్ బిహార్ పేరు మీద ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఈ యూట్యూబ్ చానెల్ ప్రజలను ఆకట్టుకుంది. అతడి వీడియో చానెల్‌కు 8.75 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
తమిళనాడులో బిహార్ నుంచి వలస వచ్చిన వారిపై స్థానికులు దాడులు చేస్తున్నట్లు మనీష్ కశ్యప్ ఓ నకిలీ వీడియోని సృష్టించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో 2023, మార్చిలో మనీష్ కశ్యప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. తమిళనాడుకు తరలించారు. దీంతో కొన్ని నెలలపాటు మధురై జైల్లో ఉన్నారు. అనంతరం అతడిని బిహార్ జైలుకు తరలించారు.ఆ తర్వాత 2023, డిసెంబర్‌లో మనీష్ కశ్యప్ జైలు నుంచి విడుదలయ్యాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)