Sachin COVID Positive: సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్, స్వీయ నిర్భంధంలోకి లిటిల్ మాస్టర్, కుటుంబంలోని మిగిలిన వారికి క‌రోనా నెగటివ్ గా నిర్ధార‌ణ

ఇటీవలే రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెట‌ర్ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా (Sachin COVID-19 Positive) సోకింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ టెస్టు చేయించుకోగా త‌న‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, త‌న‌ కుటుంబంలోని మిగిలిన వారికి క‌రోనా నెగటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని ఆయ‌న తెలిపారు. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని, వైద్యుల సూచ‌న‌లు తీసుకుంటున్నాన‌ని చెప్పారు. క‌రోనా సోకిన నేప‌థ్యంలో (Sachin Tendulkar Tests Positive for COVID-19) త‌న‌కు అండగా నిలిచిన ఆరోగ్య సిబ్బంది అందరికీ థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. కాగా, రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో సచిన్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో ఇటీవ‌ల‌ శ్రీలంకపై గెలుపొందింది.

Sachin Tendulkar (Photo Credits: PTI)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement