Tamilisai Soundararajan Rejoins BJP: బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తుత్తుకూడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు.ఆమె తమిళనాడు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Tamilisai Soundararajan rejoins BJP (Photo-ANI)

చెన్నై, తమిళనాడు | తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు.ఆమె తమిళనాడు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్‌ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, గత కొద్ది రోజులుగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే

రాజీనామా అనంతరం విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై దృష్టి సారించేందుకే పదవికి రాజీనామా చేశానని అన్నారు. తెలంగాణా, పుదుచ్చేరి ప్రజల ఆప్యాయతకు రుణపడి ఉంటానన్నారు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ప్రజల మధ్య ప్రత్యక్షంగా పని చేయటమే ఇష్టమని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా వార్తలు

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now