Asia Cup 2022- Virat Kohli On MS Dhoni- Viral: ధోనితో ఉన్న ఫొటో షేర్ చేసి కోహ్లి భావోద్వేగం! ఆందోళనలో ఫ్యాన్స్ ఎందుకంటే?
ధోనితో ఉన్న ఫొటో షేర్ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్ ఆందోళన!
New Delhi, August 26: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎల్లప్పుడూ అభిమానాన్ని చాటుకుంటాడు. తాజాగా కోహ్లి.. ధోనిని ఉద్దేశించి భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ధోనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్న నాటి ఫొటోను షేర్ చేసిన కోహ్లి.. ‘నా కెరీర్ మొత్తంలో నేను ఆస్వాదించిన అత్యంత అద్భుతమైన క్షణాలు ఏవైనా ఉన్నాయంటే.. ఈయనకు నమ్మదగిన డిప్యూటీగా ఉండటమే! మేము కలిసి ఆడిన సమయం.. నమోదు చేసిన భాగస్వామ్యాలు ఎల్లప్పుడూ నా మదిలో నిలిచిపోతాయి. 7+18’ అంటూ హార్ట్ ఎమోజీ జత చేశాడు. కాగా ధోని జెర్సీ నంబర్ 7 కాగా.. కోహ్లి 18 నంబరు గల జెర్సీ ధరిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కలిసి వచ్చేలా 25వ తేదీన కోహ్లి ఈ మేరకు తమ అనుబంధం గురించి ట్వీట్ చేశాడు. అయితే, అభిమానులు మాత్రం.. కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలో ఉన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)