West Bengal Elections 2021: బీజేపీ నేత తమ్ముడి కారుపై దాడి, సువేందు అధికారి సోద‌రుడైన సౌమెందు అధికారి కారును ధ్వంసం చేసిన దుండుగులు, తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కుడే దాడి చేయించాడ‌ని బీజేపీ నేత‌లు ఆరోపణ

ప‌శ్చిమ‌బెంగాల్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ లో (West Bengal Elections 2021) అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని కోంటై అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని మూడు పోలింగ్ బూత్‌ల ప‌రిధిలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకున్నంది. బీజేపీ కీల‌క నేత సువేందు అధికారి సోద‌రుడైన సౌమెందు అధికారి కారును దుండ‌గులు (Suvendu Adhikari's brother's car attacked) అడ్డ‌గించి ధ్వంసం చేశారు. కారు డ్రైవ‌ర్‌పై దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో సౌమెందు అధికారికి ఎలాంటి గాయాలు కాలేదు.

Suvendu Adhikari's brother's car attacked (Photo-ANI)

స్థానిక తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కుడే ఈ దాడి చేయించాడ‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. టీఎంసీ బ్లాక్ అధ్య‌క్షుడు రామ్ గోవింద్ దాస్, ఆయ‌న భార్య‌ మ‌నుషులే త‌నపై దాడికి పాల్ప‌డ్డార‌ని సౌమెందు అధికారి విమ‌ర్శించారు. మొత్తం మూడు పోలింగ్ బూత్‌ల ప‌రిధిలో వాళ్లు రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని, అందుకే తాను అక్క‌డికి వెళ్ల‌గానే వారి ప‌నికి అడ్డు తగులుతాన‌ని నా కారును ధ్వంసం చేశార‌ని, డ్రైవ‌ర్‌ను కొట్టార‌ని సౌమెందు ఆరోపించారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎనిమిది విడత‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జరగనున్నాయి.

Here's Attack Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now