CM YS Jagan Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణాన్నివేడుకగా జరుపుకోవాలని సూచన

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు (CM YS Jagan Sri Rama Navami Wishes) తెలియజేశారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

AP Assembly session cm-jagan-sensational-comments-ap-capital(Photo-Twitter)

సీతారాముల, దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభిలషించారు. కరోనా విపత్తును ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్‌ జగన్‌ అన్నారు.

ట్విట్టర్ లో సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శప్రాయుడు. పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రోజు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అంటూ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement