Lal Bahadur Shastri Jayanti 2021: గాంధీ, శాస్త్రిలకు ట్విట్టర్ ద్వారా ఘనంగా నివాళి అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వారి సేవలను కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు.

AP Chief Minister YS Jagan | File Photo

నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు. ‘భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్‌ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల కిందటే అడుగులు పడ్డాయని అన్నారు. నేటి నుంచి `క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌`కు శ్రీ‌కారం చుడుతున్నామని తెలిపారు. మ‌హాత్ముడి జ‌యంతి సంద‌ర్భంగా ఆయనకు నివాళులు అంటూ ట్వీట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)