Miss World 2021 Postponed: మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా, మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మందికి కరోనా, పోటీదారులంతా పోర్టారికోలోనే ఐసోలేష‌న్‌లో..

మిస్ వరల్డ్ పోటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సెగ త‌గిలింది. మిస్ ఇండియా వ‌ర‌ల్డ్‌ మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మిస్ వ‌ర‌ల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాప‌డ్డాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

మిస్ వరల్డ్ పోటీల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సెగ త‌గిలింది. మిస్ ఇండియా వ‌ర‌ల్డ్‌ మాన‌స వార‌ణాసితో పాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మిస్ వ‌ర‌ల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాప‌డ్డాయి. పోటీల నిర్వాహ‌కులు గురువారం నాడు ఈవెంట్ ప్రారంభానికి కేవ‌లం కొన్ని గంట‌ల ముందు ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం పోటీదారులంతా మిస్ వ‌ర‌ల్డ్ ఫినాలే జ‌రగాల్సిన పోర్టారికోలోనే ఐసోలేష‌న్‌లో ఉన్నారు. కంటెస్టెంట్ల‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మిస్ వ‌ర‌ల్డ్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌ను తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించాం అని అధికారిక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. రాబోయే 90 రోజుల్లో పోర్టారికో కొలీజియం జోస్ మిగ్వెల్ అగ్రెలాట్ ప్ర‌పంచ సుంద‌రి ఫినాలే పోటీలు ఎప్పుడ‌నేది రీషెడ్యూల్ చేస్తుంద‌ని వెల్ల‌డించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now