Adenovirus in WB: అడెనోవైరస్ కల్లోలం, చిన్న పిల్లలు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందే, ఆదేశాలు జారీ చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
దీంతో పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని అడెనోవైరస్ వణికిస్తోంది. దీంతో పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.బెంగాల్‌లో అడెనోవైరస్ బారినపడి ఇప్పటివరకు 19 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 13 మంది చిన్నారులకు దీర్ఘకాలిక రోగాలున్నాయని మమత చెప్పారు. పిల్లలలో దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఒకవేళ జ్వరం ఉంటే తక్షణమే హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలని స్పష్టం చేశారు.
అడెనోవైరస్ లక్షణాలు
జ్వరం, జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, కళ్లు గులాబీ రంగులోకి మారడం, న్యుమోనియా, శ్వాసనాళాల వాపు, జీర్ణాశయంలో ఇన్‌ఫెక్షన్
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)