Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయంలో ఇకపై మొబైల్ ఫోన్లు నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ
యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో తన ప్రేమను ప్రపోజ్ చేసిన ఘటన వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆలయంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ.ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్బంగా శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర మాట్లాడుతూ.. కేదార్‌నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికులు నిండైన దుసులు ధరించాలని, గతంలో కొంతమంది ఇష్టానుసారంగా దుస్తులు ధరించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ.. అది సరైన పద్దతి కాదన్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బద్రీనాథ్ లో కూడా మొబైల్ ఫోన్లను నిషేధించే విషయమై ఆలోచిస్తున్నామన్నారు.
Here's Video