Ram Mandir Consecration Ceremony: వీడియో ఇదిగో, రాముని పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి, తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 1475 కిలోల ఆవుపేడ

రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్‌ వడోదరలోని తర్సాలీ గ్రామం ఈ 108 అడుగుల అగర్‌‌బత్తీని తయారుచేసింది.

108-ft long incense stick brings Gujarat's fragrance to Ayodhya Ram temple

అయోధ్య రామమందిరంలో రాముని పాదాల చెంత 108 అడుగులు, 3.5 అడుగుల వెడల్పుతో భారీ అగర్‌బత్తి వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్‌ వడోదరలోని తర్సాలీ గ్రామం ఈ 108 అడుగుల అగర్‌‌బత్తీని తయారుచేసింది. ఈ భారీ అగర్‌బత్తి కారణంగా రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థులు తెలిపారు.

అగర్‌బత్తి తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడ తదితర వాటిని ఉపయోగించారు. ఈ అగర్‌బత్తి మొత్తం బరువు 3,400 కిలోలు. గ్రామస్థులు మొత్తం ఈ అగర్‌బత్తి తయారీలో పాలుపంచుకున్నారు. అయోధ్య చేరిన ఈ అగర్‌బత్తిని మంగళవారం శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ జీ మహారాజ్ సమక్షంలో ముట్టించారు.

Here's Video