Ayodhya Ram Mandir: రాముని ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డ పుట్టాలి.. ఆ రోజే ప్రసవం జరిగేలా చూడాలని వైద్యులకు గర్భిణుల అభ్యర్థన
తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు.
Ayodhya, Jan 8: అయోధ్యలో (Ayodhya) శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు (Pregnant Women) పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు (Lord Sri Ram) జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడే ప్రసవించేలా చేయాలని కోరుతున్నారు. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్య మాదిరిగా తాము కూడా చరితార్థులం కావాలని గర్భిణులు కోరుకుంటున్నారు. దవాఖానల్లోని వైద్యులు కూడా వీరి కోరికను తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గర్భిణి ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే ఆ రోజు ప్రసవం జరిగేలా చేస్తామని షరతు విధిస్తున్నామని వైద్యులు చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)