Viral Video: వీడియో ఇదిగో, పోతే నా ఒక్క ప్రాణమే..సాహసం చేస్తే 9 మంది ప్రాణాలు, భారీ వరదల్లో ఖమ్మం జేసీబీ డ్రైవర్ చేసిన సాహసంపై ప్రశంసల వర్షం
తెలంగాణలో వచ్చిన వరదలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది.
తెలంగాణలో వచ్చిన వరదలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది.వరద ధాటికి ప్రకాశ్‌నగర్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహించింది. అయితే ఈ బ్రిడ్జి మీద చిక్కుకుపోయిన తొమ్మిది మంది సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. ఈ ప్రమాదకర వరదల్లో సుభాన్ ఖాన్ అనే జేసీబీ డ్రైవర్ ప్రదర్శించిన సాహసం.. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్
వాళ్లను రక్షించేందుకు సుభాన్ ప్రయత్నిస్తుండగా అంతా వారించారు. ‘నేను అక్కడిపోతే నాది ఒక్క ప్రాణం పోవచ్చు. నేను సాహసం చేస్తే తొమ్మిది ప్రాణాలు రక్షించిన వాడిని అవుతాను’ అని జేసీబీతో వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. వరద సహాయక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీఆర్‌ఎస్ నేతలు, స్థానిక ప్రజలు జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ చేసిన సాహసాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుభాన్‌ను ఫొన్‌లో అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)