Oldest Skydiver: 104 ఏళ్ల వయసులో 4100 మీటర్ల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకు దూకిన బామ్మ.. గిన్నిస్ రికార్డు నెలకొల్పడమే తన లక్ష్యమని వెల్లడి
ఇదో సాహసోపేతమైన ఘటన. గిన్నిస్ ప్రపంచరికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా వృద్ధురాలు డొరొతీ హాఫ్ మన్ 104 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేశారు.
Newdelhi, Oct 3: ఇదో సాహసోపేతమైన ఘటన. గిన్నిస్ ప్రపంచరికార్డు (Guiness World Record) నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా (America) వృద్ధురాలు డొరొతీ హాఫ్ మన్ 104 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేశారు. నిపుణుడైన మరో స్కైడైవర్ తో కలిసి ఆమె విమానం 4,100 మీటర్ల ఎత్తున ఉండగా టాండమ్ జంప్ చేశారు. చికాగోలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దిగ్విజయంగా స్కైడైవ్ పూర్తి చేసిన అనంతరం డొరొతీ చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న వారికి అభివాదం చేశారు. స్కైడైవింగ్ చేసిన అత్యంత పెద్దవయసు వ్యక్తిగా ఈ ఫీట్ తో తనకు రికార్డు దక్కుతుందని డొరొతీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రికార్డు స్వీడెన్‌కు చెందిన లినేయా లార్సన్ పేరిట ఉంది. 2022 మేలో ఆమె 103 వయసులో స్కైడైవింగ్ దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
Advertisement
సంబంధిత వార్తలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Major Tragedy Averted: షాకింగ్ వీడియో ఇదిగో, విమానం ల్యాండవుతుండగా రన్‌వే పైకి దూసుకొచ్చిన మరో విమానం, చివరకు ఏం జరిగిందంటే..
Advertisement
Advertisement
Advertisement