Viral News: గొడవల్లో గాయపడ్డ తన తండ్రిని రక్షించుకోవడానికి 35 కిలోమీటర్లు రిక్షా తొక్కిన 14 ఏండ్ల బాలిక.. ఒడిశాలో ఘటన
గొడవల్లో గాయపడ్డ తన తండ్రిని రక్షించుకోవడానికి 14 ఏండ్ల బాలిక పెద్ద సాహసమే చేసింది. చికిత్స చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని దైన్య పరిస్థితుల్లో తండ్రిని రిక్షాలో ఎక్కించుకుని 35 కిలోమీటర్లు తొక్కి దవాఖానలో చేర్చింది.
Newdelhi, Oct 28: గొడవల్లో గాయపడ్డ తన తండ్రిని రక్షించుకోవడానికి 14 ఏండ్ల బాలిక (14 Years Girl) పెద్ద సాహసమే చేసింది. చికిత్స చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని దైన్య పరిస్థితుల్లో తండ్రిని రిక్షాలో (Riksha) ఎక్కించుకుని 35 కిలోమీటర్లు తొక్కి దవాఖానలో (Hospital) చేర్చింది. ఈ ఘటన ఒడిశాలోని (Odisha) భద్రక్ లో ఈ నెల 23న చోటుచేసుకోగా, గురువారం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రిని పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని, వారం రోజుల తర్వాత రమ్మని పంపించేశారు. నాలుగు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో భద్రక్ ఎమ్మెల్యే సాహిబ్ మాలిక్, మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర దాస్ వచ్చి తండ్రి చికిత్సకు అవసరమయ్యే సహాయాన్ని అందజేస్తామని హామీనిచ్చారు. తండ్రిని రక్షించుకోవడానికి బాలిక చేసిన సాహసాన్ని పలువురు అభినందించి, తగిన విధంగా ఆదుకుంటామని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)