Red Onions Or White Onions (Photo-Wikimedia Commons)

Newdelhi, Oct 28: ధరల మోతతో (Price Hike) సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ ధరాఘాతంలో దేశంలోని ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేదు. నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి క్షీణించింది. ఈ మధ్య వరకు టమోటా (Tomato) ధరల ‘మోత’ మోగగా, ఇప్పుడు ఉల్లిగడ్డల (Onion) వంతు వచ్చింది. కొనకుండానే, కోయకుండానే వినియోగదారుల కండ్లలో ఉల్లి నీళ్లు తెప్పిస్తున్నది. దేశంలో ఉల్లిపాయల ధరలు ప్రస్తుతం ఆకాశన్నంటాయి. నెల రోజుల వ్యవధిలో ఉల్లి ధర దాదాపు రెట్టింపు అయింది. దేశవ్యాప్తంగా సగటు రిటైల్‌ ఉల్లి ధర 57 శాతం పెరిగింది. ఏడాది క్రితం రూ.30గా ఉన్న సగటు కిలో ఉల్లి ధర శుక్రవారం రూ.47కి చేరింది.

Criminalise Adultery: వ్యభిచారం క్రిమినల్‌ నేరమే.. ప్రభుత్వానికి మళ్లీ సిఫారసు చేయనున్న పార్లమెంటు కమిటీ? అసలేంటీ విషయం??

మరిన్ని కష్టాలు?

దేశ రాజధాని ఢిల్లీలో అయితే గత వారం వరకు రూ.35-40 పలికిన ఉల్లి ప్రస్తుతం రూ.50-80కి చేరిందని వినియోగదారులు చెబుతున్నారు. గత వారం కిలో ఉల్లి రూ.40కు కొన్న తాను ఇప్పుడు రూ.80 కొనాల్సి వచ్చిందని నోయిడాకు చెందిన శేఖర్‌ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి పంట అత్యధికంగా పండించే మహారాష్ట్రలోని నాసిక్‌ లో కిలో ఉల్లి రూ.25 నుంచి రూ.50-60కి పెరిగింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొన్ని మార్కెట్లలో ధర రూ.80 వరకూ ఉన్నది. ఖరీఫ్‌ పంట ఉత్పత్తి ఆలస్యం నేపథ్యంలో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, డిసెంబర్‌ చివరి వరకు ధరల మంట ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. బఫర్ స్టాక్ ను మార్కెట్ లోకి విడుదల చేయనున్నది.

SA Vs PAK: పాక్‌ సెమీస్ ఆశలు గల్లంతు, చెపాక్‌లో రాణించిన మార్‌క్రమ్, పాక్‌పై ఒక వికెట్ తేడాతో సౌతాఫ్రికా విన్, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సఫారీలు